News

వరంగల్ జిల్లాలో వింత


వరంగల్ జిల్లాలోని సింగారంలోని మరియాపురం చర్చిలో మేరీమాత విగ్రహం కళ్ల నుంచి రక్తం కారుతుందనే ప్రచారంతో చూచేందుకు భారీగా స్థానికులు తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం విగ్రహం కంటి నుంచి ఎరుపు రంగు కనిపించడంతో అది రక్తమంటూ స్థానికులు గుర్తించి చర్చి ఇన్చార్జ్ బిషప్ జోషప్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చి మేరీమాత విగ్రహం కంటి నుంచి రక్తం వస్తుందని చెప్పడంతో గురువారం ఉదయం నుంచి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి జనం తండోపతండాలు తరలి వస్తున్నారు. దీంతో క్రైస్తవ మతో బోధకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొంత మంది ఇదంతా వట్టి ప్రచారమేనని అంటున్నారు.